Fake Certificates
Fake Certificates | నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Certificates | నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసేవారు రెచ్చిపోతున్నారు. దొంగ సర్టిఫికెట్లతో రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్​ (Hyderabad)లోని కేపీహెచ్​బీ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. తాజాగా వరంగల్​ (Warangal)లో ఫేక్​ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు. 15 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్​ చేశారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Fake Certificates | ఆర్టీఏ ఉద్యోగల పాత్ర!

నకిలీ సర్టిఫికెట్ల ముఠాలో ఆర్టీఏ ఉద్యోగుల(RTA Officers) పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొరికిన నిందితుల్లో పలువురు ఆర్టీఏ ఏజెంట్లుగా చెలామణి అవుతున్నారు. దీంతో ఆర్టీఏ ఉద్యోగుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి ఆరు కంప్యూటర్లు, రెండు ల్యాప్​టాప్​లు, రెండు ప్రింటర్లు, 17 మొబైల్స్, కార్డు ప్రింటింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.