Homeక్రైంFake Certificates | నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

Fake Certificates | నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Certificates | ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల (Fake Certificates) ముఠా గుట్టు రట్టు చేశారు. ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన ముగ్గురు ముఠాగా ఏర్పడి నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఇతర రాష్ట్రాలకు చెందిన 9 మంది యువకులకు నకిలీ ధ్రువ పత్రాలు ఇచ్చారు. అయితే ఆయా ఫేక్​ సర్టిఫికెట్లతో సదరు యువకులు ఉద్యోగాలు సాధించారు. వారి నుంచి ఈ ముఠా సభ్యులు రూ.9లక్షలు వసూలు చేశారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేశారు.

ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేసి, రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ముఠా ఈ తొమ్మిది మందికే దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిందా.. బాధితులు ఇంకా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేగాకుండా ఫేక్​ సర్టిఫికెట్లు పొందిన వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారనే వివరాలు సైతం ఆరా తీస్తున్నారు.