అక్షరటుడే, వెబ్డెస్క్ : Fake Certificates | హైదరాబాద్ పోలీసులు hyderabad police నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు. ప్రస్తుతం నకిలీ సర్టిఫికెట్ల బెడద ఎక్కువ అయింది. కష్టపడి చదువుకున్న వారికంటే వీరిదే హవా నడుస్తోంది. ఏళ్లకు ఏళ్లు చదివి డిగ్రీలు సంపాదించిన వారికి పోటీగా.. నకిలీ సర్టిఫికెట్లతో పట్టాలు పొందిన వారు వస్తున్నారు.
ఇలా వివిధ యూనివర్సిటీల పేరిట ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దందాతో సంబంధం ఉన్న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల పేరిట తయారు చేసిన 108 నకిలీ సర్టిఫికెట్లను, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.