ePaper
More
    Homeక్రైంFake Apple products | నకిలీ యాపిల్​ ఉత్పత్తుల స్కాం.. రూ.3 కోట్ల విలువైన యాక్సెసరీస్​...

    Fake Apple products | నకిలీ యాపిల్​ ఉత్పత్తుల స్కాం.. రూ.3 కోట్ల విలువైన యాక్సెసరీస్​ స్వాధీనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Apple products | మార్కెట్​లో యాపిల్ (Apple)​ సంస్థకు ఉన్న క్రేజ్​ గురించి అందరికీ తెలిసిందే. యాపిల్​ బ్రాండ్ సామగ్రి కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ధర ఎంతయినా ఆలోచించకుండా కొనుగోలు చేస్తారు. అయితే యాపిల్​ యాక్సెసరీస్​కు మార్కెట్​లో ఉన్న డిమాండ్​ను కొందరు క్యాష్​ చేసుకుంటున్నారు. నకిలీ యాపిల్​ ప్రోడక్ట్స్​ తయారు చేసి విక్రయిస్తున్నారు.

    హైదరాబాద్​లోని (Hyderabad) మీర్​చౌక్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో సోమవారం టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేశారు. రూ.3 కోట్ల విలువైన డూప్లికేట్​ యాపిల్ యాక్సెసరీస్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇర్ఫాన్ అలీ, షాహిద్ అలీ, సంతోష్ రాజ్‌ పురోహిత్​లను అరెస్ట్​ చేశారు. వీరు ముంబైలోని ఏజెంట్ల నుంచి నకిలీ యాపిల్​ సామగ్రి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.

    READ ALSO  SBI ATM | రెచ్చిపోయిన దొంగలు.. ఏటీఎంలో చోరీ

    Fake Apple products | స్టిక్కర్లు అతికించి విక్రయం

    నిందితులు ముంబై నుంచి డూప్లికేట్​ యాపిల్​ వాచ్​లు, ఎయిర్​ పాడ్స్​, పవర్​ బ్యాంకులు, కేబుళ్లు కొనుగోలు చేస్తున్నారు. వాటికి యాపిల్​ స్టిక్కర్లు, లోగోలు అతికించి హైదరాబాద్​లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం పోలీసులు వారిపై దాడి చేశారు. రూ.మూడు కోట్ల విలువ చేసే యాపిల్​ యాక్సెసరీస్​ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులు టాస్క్​ఫోర్స్​ పోలీసులు సీజ్​ చేశారు. యాపిల్​ ప్రతినిధులతో కలిసి పోలీసులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.

    సాధారణంగా ఇతర కంపెనీల వస్తువులతో పోలిస్తే యాపిల్​ ప్రోడక్టులకు ధర అధికంగా ఉంటుంది. అయినా చాలా మంది వీటిని కొనుగోలు చేస్తారు. అయితే నకిలీ యాపిల్​ ఉత్పత్తుల స్కాం వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రూ.వేలు పెట్టి తాము కొనుగోలు చేసిన యాపిల్​ సామగ్రి అసలుదా.. నకిలీదా అని ఆలోచిస్తున్నారు. బ్రాండ్​, నాణ్యత కోసం చాలా మంది యాపిల్​ యాక్సెసరీస్​ కొనుగోలు చేస్తారు. అయితే ఈ నిందితులు హైదరాబాద్​లో ఎన్ని కోట్ల విలువైన నకిలీ వస్తువులు విక్రయించారో పోలీసుల విచారణలో తేలనుంది.

    READ ALSO  Jagityala | భార్యా పిల్లలను వదిలేశాడు.. ట్రాన్స్‌జెండర్​ వెంటపడ్డాడు..

    Latest articles

    GST fraud | భారీ జీఎస్టీ మోసం.. రూ.100 కోట్లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కామ్

    అక్షరటుడే, హైదరాబాద్: GST fraud : తెలంగాణ(Telangana)లో భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో...

    Officers Retirement | ఒకేసారి ఐదుగురు అధికారుల పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన ఆయా శాఖల సిబ్బంది

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Officers Retirement : నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు...

    Collector | కమ్మర్​పల్లి, మోర్తాడ్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector : కమ్మర్ పల్లి, మోర్తాడ్ (Mortad)మండల కేంద్రాలలో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...

    Task force raids | వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి.. పలువురి అరెస్టు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Task force raids : నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడులు...

    More like this