HomeUncategorizedNEET Student | నీట్​లో ఫెయిల్ కావడమే దశ మార్చింది.. బెంగళూరు విద్యార్థికి జాక్ పాట్.....

NEET Student | నీట్​లో ఫెయిల్ కావడమే దశ మార్చింది.. బెంగళూరు విద్యార్థికి జాక్ పాట్.. రూ.72 లక్షల ప్యాకేజీతో జాబ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: NEET Student | డాక్టర్ కావాలనుకుని కలలు గన్న ఓ విద్యార్థిని నీట్​లో (NEET) అర్హత సాధించలేదు. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీలో జాబ్ కొట్టింది. రూ.72 లక్షల ప్యాకేజీని సొంతం చేసుకుంది.

బెంగళూరుకు చెందిన రీతుపర్ణ చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే, నీట్ అర్హత సాధించడంలో విఫలమైన ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో ఇంజినీరింగ్ చేయాల్సి వచ్చింది. 20 ఏళ్ల వయస్సులోఆమె.. రోల్స్ రాయిస్ జెట్ ఇంజిన్ (Rolls-Royce Jet Engine) తయారీ విభాగంలో చేరి సంవత్సరానికి రూ.72.3 లక్షల ఉద్యోగాన్ని చేజెక్కించుకుంది.

NEET Student | రోబోటిక్స్​లో ఇంజినీరింగ్..

మంగళూరులోని సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (Sahyadri College of Engineering) అండ్ మేనేజ్మెంట్​లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సమయంలోనే ఆమె రోల్స్ రాయిస్​లో ఎనిమిది నెలల కఠినమైన ఇంటర్న్​షిప్​ పూర్తి చేసింది. ఇది డిసెంబర్ 2024లో ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ చేజిక్కించుకుంది. మొన్నటి ఏప్రిల్ మాసంలో పెరిగిన వేతనంతో కలిపి ఆమె రూ.72 లక్షల ప్యాకేజీకి చేరుకుంది.

“నేను రోబోటిక్స్, ఆటోమేషన్ ఇంజినీరింగ్ చేశా. వినూత్న ఆవిష్కరణలపై ఎంతో ఆసక్తి ఉంది. కొత్త విషయాలను నేర్చుకోవడం, ఆలోచనలను అభివృద్ధి చేయడం, సంబంధిత సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంపైనే నా దృష్టి ఉంటుంది” అని రీతుపర్ణ కేఎస్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాశారు. ప్రజలతో కమ్యూనికేట్ చేయడంలో, ప్రెజెంటేషన్లు ఇవ్వడంలో, జ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు పంచుకోవడంలో ఎంతో ఆనందం ఉందని పేర్కొన్నారు.

NEET Student | నీట్ నుంచి ఇంజినీరింగ్ వరకు..

మంగళూరులోని (Mangalore) సెయింట్ ఆగ్నెస్ కళాశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసిన రీతుపర్ణ.. ఆ తర్వాత వైద్య రంగం వైపు వెళ్లాలని అనుకున్నారు. కానీ నీట్ లో అర్హత సాధించక పోవడంతో ఎంబీబీఎస్ లో చేరే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇంజనీరింగ్లో చేరారు.. 2022లో సహ్యాద్రి కళాశాలలో రోబోటిక్స్, ఆటోమేషన్​లో (Automation) చేరిన ఆమె.. అక్కడ ఆచరణాత్మక అభ్యాసం, సాంకేతిక అన్వేషణపై దృష్టి సారించింది. రైతులకు సహాయం చేయడానికి రోబో తయారీ ప్రాజెక్ట్​లో ఆమె భాగస్వామ్యం పంచుకున్నారు.

గోవాలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో పతకాలు సాధించిన రీతుపర్ణ..  సూరత్కల్లో ఒక బృందంతో కూడా పనిచేసింది. దక్షిణ కన్నడ DC ఫెలోషిప్​లో పాల్గొంది. బీటెక్ చదువుతున్న సమయంలోనే ఆమె ఇంటర్న్​షిప్​ పూర్తి చేసి రోల్స్ రాయిస్​లో ఉద్యోగం సంపాదించింది, డిమాండ్ ఉన్న పనులను తీర్చడానికి జనవరి 2025 నుంచి నైట్ షిఫ్టుల్లోనూ పని చేసి ప్రతిభ చాటింది. ఆమె పనితీరును గుర్తించిన కంపెనీ ఆమె జీతాన్ని సంవత్సరానికి రూ. 39.6 లక్షల నుండి రూ. 72.3 లక్షలకు పెంచింది. రోల్స్ రాయిస్ టెక్సాస్ జెట్ ఇంజిన్ విభాగంలో చేరడానికి సిద్ధంగా ఉన్న 20 ఏళ్ల రీతుపర్ణ.. కంపెనీ జెట్ విభాగంలో అతి పిన్న వయస్కురాలిగా నిలవనుంది.