అక్షరటుడే, కామారెడ్డి: Sadashiv nagar | గోల్డ్‌షాప్ (Gold shops) కోసం వేస్తున్న షెడ్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ ఘటన సదాశివనగర్ (Sadashiv Nagar Police) మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బంజె చిన్న ప్రభులింగం తన నివాసంలో షెడ్ నిర్మించాడు. అందులో ప్రస్తుతం ఫర్నీచర్ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు షెడ్డు వద్దకు వచ్చి ఫర్నీచర్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయారు. దాంతో షాప్ పాక్షికంగా కాలిపోయింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే ఇటీవల మార్వాడీ గో బ్యాక్ (Marwadi Go Back) ఉద్యమం తీవ్రంగా సాగుతోంది. ఇటీవల సదాశివనగర్ మండల కేంద్రంలో సైతం ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సంబంధిత గోల్డ్ షాప్ మార్వాడీలకు సంబంధించినదేనని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్‌చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. షాప్ మార్వాడీలకు చెందినదని జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. ఎవరైనా నేరపూరిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.