ePaper
More
    HomeజాతీయంMaharashtra | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. బాల్​ఠాక్రే చేయలేని పని ఫడ్నవీస్​ చేశారు..

    Maharashtra | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. బాల్​ఠాక్రే చేయలేని పని ఫడ్నవీస్​ చేశారు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Maharashtra | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్న రాజ్​ ఠాక్రే(Raj Thackeray), ఉద్దవ్​ ఠాక్రే(Uddhav Thackeray) ఒకే వేదికపై కలిశారు. బాల్​ఠాక్రే సోదరుడి కుమారుడైన రాజ్​ ఠాక్రే గతంలో శివసేనలో కీలకంగా ఉండేవారు. అయితే బాల్​ఠాక్రే(Bal Thackeray) తన కుమారుడైన ఉద్దవ్​ ఠాక్రేకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో శివసేన నుంచి 2005లో బయటకు వచ్చిన ఆయన సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ్​సేన (MNS) అనే పార్టీని స్థాపించారు. అప్పుడు విడిపోయిన రాజ్​ఠాక్రే, ఉద్దవ్​ ఠాక్రే 20 ఏళ్ల తర్వాత మళ్లీ శనివారం కలుసుకోవడం గమనార్హం.

    మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) ఇటీవల రాష్ట్రంలో త్రిభాష విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. హిందీని తప్పనిసరిగా చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఎంఎన్ఎస్​ అధినేత రాజ్​ఠాక్రేతో పాటు శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్దవ్​ ఠాక్రే, మహా వికాస్​ అఘాడీ నేతలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో ఠాక్రే సోదరులు ఇది తమ విజయంగా పేర్కొంటు శనివారం వాయిస్​ ఆఫ్​ మరాఠీ(Voice of Marathi) కార్యక్రమం నిర్వహించారు.

    READ ALSO  Garibhrath Express | గరీబ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు.. తప్పిన ప్రమాదం

    Maharashtra | ఆయన చేయలేకపోయారు..

    సమావేశంలో రాజ్​ఠాక్రే మాట్లాడుతూ.. తమ పెద్ద నాన్న బాల్​ ఠాక్రే చేయలేని పనిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis)​ చేశారన్నారు. తమ ఇద్దరు సోదరులనున కలపాలని బాల్​ఠాక్రే ఎన్నో ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. అయినా తాము 20 ఏళ్లుగా కలవలేదన్నారు. అయితే తాజాగా ఫడ్నవీస్​ తమను కలిపారని సెటైర్లు వేశారు. రెండు దశాబ్దాల తర్వాత సోదరులు కలుసుకోవడం మహా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.

    Maharashtra | రాజ్​ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

    ఇటీవల మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడని వారిపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై రాజ్​ఠాక్రే స్పందించారు. మరాఠీ మాట్లాడని వారిపై దాడులు సరికాదన్నారు. అలాగే తమ భాషను అవమానిస్తే బుద్ధి చెప్పాలని ఎంఎన్​​ఎస్​ కార్యకర్తలకు సూచించారు. అంతేగాకుండా ‘‘మీరు ఏం చేసినా వీడియోలు రికార్డు చేయొద్దు.. కెమెరాల కంట పడకుండా ఉండాల’’ని ఆయన సూచించడం గమనార్హం. మరోవైపు మరాఠీ అంశంపై రాజ్ ఠాక్రేను ప్రశ్నించినందుకు ఎంఎన్ఎస్​ కార్యకర్తలు సుశీల్ కేడియా కార్యాలయం (Sushil Kedia Office)పై దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్​ చేశారు. తమకు హిందీపై ద్వేషం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే బలవంతంగా ఆ భాషను తమపై రుద్దితే ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్​ఠాక్రే, ఉద్దవ్​ ఠాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్ర, మరాఠీ ప్రజల ప్రయోజనాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. తాము కలిసి ఉండటానికి ఒకే వేదికపైకి వచ్చామని పేర్కొన్నారు.

    READ ALSO  Maharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    Latest articles

    KTR | కేటీఆర్‌కు విషెస్‌ చెప్పిన దఫేదర్​రాజు, గంపగోవర్ధన్​

    అక్షరటుడే, నిజాంసాగర్‌: KTR | ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ ఛైర్మన్‌(Former ZP Chairman) దఫేదార్‌ రాజు, మనకోసం–మనం...

    Telangana University | సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన నిరంతర ప్రక్రియ

    అక్షర టుడే, ఇందల్వాయి: Telangana University | సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన నిరంతర ప్రక్రియగా ఉండాలని తెయూ...

    Secunderabad | సికింద్రాబాద్​ డీఆర్​ఎంగా గోపాల కృష్ణన్​ నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Secunderabad | సికింద్రాబాద్ (Secunderabad )​ డివిజన్​ డీఆర్​ఎం(డివిజనల్​ రైల్వే మేనేజర్​)గా ఆర్​ గోపాల...

    Forest Department | కాటేపల్లి తండాలో ఉద్రిక్తత.. కబ్జాలను తొలగించిన అటవీశాఖాధికారులు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Forest Department | పెద్ద కొడప్‌గల్‌ మండలంలోని (Pedda Kodapgal mandal) కాటేపల్లి తండాలో ఉద్రిక్త...

    More like this

    KTR | కేటీఆర్‌కు విషెస్‌ చెప్పిన దఫేదర్​రాజు, గంపగోవర్ధన్​

    అక్షరటుడే, నిజాంసాగర్‌: KTR | ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ ఛైర్మన్‌(Former ZP Chairman) దఫేదార్‌ రాజు, మనకోసం–మనం...

    Telangana University | సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన నిరంతర ప్రక్రియ

    అక్షర టుడే, ఇందల్వాయి: Telangana University | సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన నిరంతర ప్రక్రియగా ఉండాలని తెయూ...

    Secunderabad | సికింద్రాబాద్​ డీఆర్​ఎంగా గోపాల కృష్ణన్​ నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Secunderabad | సికింద్రాబాద్ (Secunderabad )​ డివిజన్​ డీఆర్​ఎం(డివిజనల్​ రైల్వే మేనేజర్​)గా ఆర్​ గోపాల...