అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలోని (Telangana University) ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (College of Arts and Science) ఆవరణలో అధ్యాపకులు పండ్ల మొక్కల విత్తనాలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ డాక్టర్ మామిడాల ప్రవీణ్‌కుమార్ హాజరై మాట్లాడారు.
భాషా శాస్త్ర విభాగాల వారీగా పండ్ల మొక్కల విత్తనాలను నాటడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అడవులు ఉంటేనే వర్షాలు సుభిక్షంగా కురుస్తాయని ఆయన వివరించారు. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ ఉర్దూ విభాగాల ఆధ్వర్యంలో బుధవారం అధ్యాపకులు పనస, బత్తాయి విత్తనాలను నాటారు. కార్యక్రమంలో భాషా శాస్త్ర విభాగాల అధ్యాపకులు డి.కనకయ్య, మూసా ఖురేషి, జమీల్ అహ్మద్, తాహెర్, అశోక్ చౌహన్, నాన్ టీచింగ్ సిబ్బంది సుధీర్, సురేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.