అక్షరటుడే, వెబ్‌డెస్క్: kohli sign at pakistan jersey | సోషల్ మీడియాలో చూసే ప్రతి ఫొటో, వీడియోను నమ్మే ముందు దాని నిజానిజాలు తప్పక తెలుసుకోవాలి. కోహ్లీ పాకిస్తాన్ జెర్సీపై సంతకం చేశాడని చెప్పే ఫొటో పూర్తిగా మార్ఫింగ్ చేసింది. ఈ ఫొటో అందరిని కన్ఫ్యూజ్ చేసింది.
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ Virat Kohliచాలా రోజుల తర్వాత బ్లూ జెర్సీలో కనిపించబోతున్నాడు. ఆస్ట్రేలియా Australia సిరీస్ కోసం ఇప్పటికే ఆసీస్ గడ్డపై అడుగుపెట్టాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఆయన పాకిస్తాన్ జెర్సీ pakistan jersey పై సంతకం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ ఫొటోను అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో “కోహ్లీ పాకిస్తానీ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు” అనే క్యాప్షన్‌తో వైరల్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ జరిపిన తర్వాత.. ఆ ఫొటో పూర్తిగా మార్ఫింగ్ చేసినది అని తేలింది.
అసలు వీడియోలో కోహ్లీ ఒక అభిమానికి సంతకం చేసిన జెర్సీ పాకిస్తాన్‌ది కాదు. ఆయన ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Royal Challengers Bangalore (RCB) జెర్సీ.
kohli sign at pakistan jersey | ఫేక్ ఫొటోలు పెరుగుతున్నాయి..
వాస్తవానికి, ఆ వీడియో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో Perth టీమ్ హోటల్ బయట తీసింది. హోటల్ నుంచి బయటకు వచ్చిన కోహ్లీ తన క్రికెట్ కిట్‌ను టీమ్ బస్సులో ఉంచి, అభిమానులతో మాట్లాడారు.
ఒక అభిమాని తన వద్ద ఉన్న RCB జెర్సీపై ఆటోగ్రాఫ్ కోరగా, కోహ్లీ దానిపై సంతకం చేశారు. ఆ చిత్రాన్ని కొంత మంది నెట్ యూజర్లు ఎడిట్ చేసి, పాకిస్తాన్ జెర్సీలా మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు.
AI, డీప్‌ఫేక్ టెక్నాలజీ అభివృద్ధితో ఫొటోలు, వీడియోలను మార్ఫ్ చేయడం ఇప్పుడు చాలా సులభమైంది. దీంతో సినీతారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు తరచూ ఫేక్ కంటెంట్ బారిన పడుతున్నారు.
ఇటీవల ఆసియా కప్ సందర్భంగా భారత్-పాక్ ఆటగాళ్ల మధ్య జరిగిన షేక్‌హ్యాండ్ వివాదం తర్వాత ఇలాంటి ఫేక్ పోస్టులు మరింత పెరిగాయి.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లతో Kl Rahul సహా భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
- మొదటి వన్డే: అక్టోబరు 19, పెర్త్ ఆప్టస్ స్టేడియం (Optus Stadium)
- రెండో వన్డే: అక్టోబరు 23
- మూడో వన్డే: అక్టోబరు 25న జరగనుంది.
ఇక టీ20 సిరీస్: అక్టోబరు 29 నుంచి నవంబరు 8 వరకు జరగనుంది. ఈ సిరీస్‌కి ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ Shubman Gill కు బాధ్యతలు అప్పగించారు. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ Suryakumar Yadav నాయకత్వం వహించనున్నాడు.