అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Training Center | నగర శివారులోని జానకంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సౌకర్యాలను మెరుగుపర్చాలని సీపీ సాయిచైతన్య (CP Sai chaithanya) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం సీపీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.
Police Training Center | క్షేత్రస్థాయిలో పరిశీలన
సెంటర్లోని సౌకర్యాలను సీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శిక్షణ కేంద్రం అనేది భవిష్యత్ పోలీస్ అధికారుల శైలిని తీర్చిదిద్దేదన్నారు. ఇక్కడ శిక్షణ పొందేవారికి శారీరక, మానసిక అభివృద్ధి జరిగేలా వాతావరణం కల్పించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. సెంటర్‌లో తగిన వసతులు, శిక్షణా పరికరాలు, శిక్షకులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
Police Training Center | ఫైరింగ్ రేంజ్..
సెంటర్‌లో వసతులు, ట్రైనింగ్ సెంటర్ గదులు, వంటశాల, నీటి సరఫరా, శౌచాలయాలు, ఇండోర్ తరగతి గదులు, అవుట్ డోర్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ (Firing range) తదితర అంశాలను పరిశీలించారు. మరమ్మతులు అవసరం ఉంటే తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్సై రమ, ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది తదితరులున్నారు.
ట్రైనింగ్ సెంటర్‌లో సదుపాయాలను పరిశీలిస్తున్న సీపీ సాయిచైతన్య
శిక్షణ కేంద్రంలో ఫైరింగ్ రేంజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీపీ