అక్షరటుడే, ఇందూరు: RTC Nizamabad | బస్టాండ్‌లో ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపర్చాలని ఆర్టీసీ కార్పొరేట్ చీఫ్ ఇంజినీర్ కవిత ఆదేశించారు. నిజామాబాద్ బస్టాండ్‌ను (Nizamabad bus stand) శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రత పరిశుభ్రతకు (safety and cleanliness) ఎటువంటి లోపాలు లేకుండా నిత్య పర్యవేక్షణ జరపాలన్నారు. అవసరమున్న చోట భవనానికి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా భవనం పైకప్పు, డ్రెయినేజీ వ్యవస్థ (drainage system), ప్రయాణికుల విశ్రాంతి గదులను మరింత అభివృద్ధి పర్చాలని సూచించారు. అనంతరం టికెట్ కౌంటర్లు, ప్లాట్‌ఫామ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు, కార్యాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు.
