అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fabtech Technologies IPO | ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో(IPO)కు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ఈనెల 29 న ప్రారంభమై వచ్చేనెల ఒకటో తేదీన ముగుస్తుంది. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం(GMP) రూ. 35 గా ఉంది.
ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్(Fabtech Technologies Ltd) కంపెనీ ఫార్మాస్యూటికల్స్, బయోటెక్, హెల్త్‌కేర్ ఇండస్ట్రీలకు టర్న్‌కీ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ అందిస్తుంది. ఇది క్లీన్‌రూమ్ సొల్యూషన్స్, హెచ్‌వీఏసీ సిస్టమ్స్ వంటి ప్రొడక్ట్స్‌ను డిజైన్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 230.35 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. ఇందులో భాగంగా రూ. 10 ముఖ విలువ(Face value) కలిగిన తాజా షేర్లను జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకోసం, అక్విజిషన్స్ ద్వారా ఇనార్గానిక్ గ్రోత్ కోసం, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఆర్థిక పరిస్థితి : కంపెనీ స్థిరమైన రెవెన్యూ, ప్రాఫిట్ గ్రోత్‌తో సాగుతోంది. 2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 230.39 కోట్ల ఆదాయాన్ని(Revenue) ఆర్జించగా.. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దానిని రూ. 335.94 కోట్లకు పెంచుకుంది. ఇదే సమయంలో నికర లాభం(Net profit) రూ. 27.22 కోట్లనుంచి రూ. 46.45 కోట్లకు పెరిగింది. ఆస్తులు రూ. 269.24 కోట్లనుంచి రూ. 426.56 కోట్లకు చేరాయి.
ప్రైస్‌బాండ్ : కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 181 నుంచి రూ. 191 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 75 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్ బాండ్(Price band) వద్ద ఒక లాట్ కకోసం రూ. 14,325తో బిడ్ వేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్‌లకోసం బిడ్ వేయవచ్చు.
కోటా, జీఎంపీ : క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల(Retail investors)కు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 35 గా ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 18 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు : కంపెనీ ఐపీవో ఈనెల 29న ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1న ముగుస్తుంది. మూడో తేదీన రాత్రి అలాట్‌మెంట్ స్టేటస్ తెలిసే అవకాశాలు ఉంటాయి. కంపెనీ షేర్లు అక్టోబర్ 7న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవనున్నాయి.