HomeUncategorizedF-35 Stealth Jet | ఎగుర‌లేని స్థితిలో ఎఫ్‌-35 స్టెల్త్ జెట్.. విమానాన్ని విడి భాగాలుగా...

F-35 Stealth Jet | ఎగుర‌లేని స్థితిలో ఎఫ్‌-35 స్టెల్త్ జెట్.. విమానాన్ని విడి భాగాలుగా చేసి త‌ర‌లించే యోచ‌న‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: F-35 Stealth Jet | సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా తిరువనంతపురం విమానాశ్రయంలో (Thiruvananthapuram Airport) అత్య‌వ‌సరంగా ల్యాండ్ అయిన బ్రిటన్‌కు చెందిన అత్యుత్త‌మ ఎఫ్‌-35 స్టెల్త్ ఫైట‌ర్ జెట్ (F-35 Stealth fighter Jet) రెండు వారాలుగా ఇక్క‌డే ఉంది. ఎంత మంది నిపుణులు వ‌చ్చి ప‌రీక్షించినా స‌మ‌స్య ఏమిటో అంతు చిక్క‌కపోవ‌డంతో అది ఎగుర‌లేని ద‌శ‌కు చేరింది. ఈ నేప‌థ్యంలో మ‌ర‌మ్మ‌తుల కోసం ఈ ఫైట‌ర్ జెట్‌ను పార్ట్ పార్ట్‌లుగా విడ‌దీసి త‌ర‌లించ‌నున్న‌ట్లు తెలిసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జూన్ 14న బ్రిటిష్ ఫైటర్ జెట్ (British fighter jet) తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఫిఫ్త్ జ‌న‌రేష‌న్ సూపర్‌సోనిక్ స్టెల్త్ ఫైటర్ విలువ 110 మిలియన్ డాల‌ర్ల‌కు పైగా ఉంటుంది. దీన్ని లాక్‌హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసింది.

F-35 Stealth Jet | హైడ్రాలిక్ స‌మ‌స్య‌..

బ్రిట‌న్‌కు చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియ‌ర్ స్ట్రైక్ గ్రూప్‌తో క‌లిసి భార‌త నావికాదళం (Indian Navy) ఇటీవ‌ల విన్యాసాలు నిర్వ‌హించింది. ఈ నేప‌థ్యంలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియ‌ర్ స్ట్రైక్ గ్రూప్‌లో అంత‌ర్భాగ‌మైన ఎఫ్‌-35 స్టెల్త్ ఫైట‌ర్ జెట్​లో సాంకేతిక లోపాలు త‌లెత్తాయి. దీంతో అత్య‌వ‌స‌రంగా తిరువ‌నంత‌పురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో (Thiruvananthapuram International Airport) ల్యాండ‌యింది. ఆ స‌మ‌యంలో ఇంధ‌నం త‌క్కువ‌గా ఉంద‌ని పైలట్ విమానాశ్ర‌య అధికారుల‌కు స‌మాచార‌మిచ్చాడు. అయితే, ఇంధ‌నం నింపిన త‌ర్వాత కూడా ఈ ఫైట‌ర్ జెట్‌ను (Fighter jet) తీసుకెళ్ల‌లేదు. హైడ్రాలిక్ స‌మ‌స్య త‌లెత్త‌డంతో ఇది పైకి లేవ‌డం లేదు. రెండు వారాలకు పైగా ఈ విమానాశ్ర‌యంలోనే.. అత్యంత ఖ‌రీదైన అధునాత‌న యుద్ధ విమానం ప‌డి ఉంది.

మ‌రోవైపు, కేర‌ళ టూరిజం శాఖ (Kerala Tourism Department) త‌న ప్ర‌చారం కోసం ఎఫ్‌-35 ఫైట‌ర్ జెట్‌ను వినియోగిస్తుండ‌డం ఆశ్చ‌క్యం క‌లిగిస్తోంది. “కేరళ, మీరు ఎప్పటికీ బయలుదేరడానికి ఇష్టపడని గమ్యస్థానం. ధన్యవాదాలు, ది ఫాక్సీ.” అని కేరళ టూరిజం ఫైట‌ర్ జెట్ ఫొటోతో ‘X’లో ఓ పోస్ట్ పెట్టింది.