అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Police | పట్టణంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని (Yellareddy town) అంబేద్కర్ చౌరస్తాలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీల్లో భాగంగా వాహనదారుల వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. వాహనాలపై పెండింగ్లో చలాన్లు (pending challans) ఉన్నట్లయితే వాటిని వెంటనే చెల్లించాలని వాహనదారులకు సూచించారు.
Yellareddy Police | నిబంధనలు పాటించాలి
సీఐ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రహదారి భద్రత అందరి బాధ్యత అన్నారు. ప్రమాదాలు నివారించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ ఎస్సైతో పాటు పలువురు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.