110
అక్షరటుడే, ఆర్మూర్: Armoor | మత్తుపదార్థాల రవాణా నేపథ్యంలో ఆర్మూర్ పోలీసులు (Armoor police) అప్రమత్తమయ్యారు. పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ (Armoor SHO Satyanarayana Goud) ఆధ్వర్యంలో సోమవారం బస్టాండ్ ఆవరణలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
Armoor | బస్సుల్లోనూ తనిఖీలు..
బస్సుల్లోనూ తనిఖీలు చేసి అనుమానితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు (drugs) దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తుపదార్థాల రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.