అక్షరటుడే, గాంధారి: RTA Yellareddy | మండల కేంద్రంలో ఆర్టీవో అధికారులు బుధవారం సాయంత్రం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎంవీఐలు ఇర్షాద్, స్నిగ్ధ (AMVI)ఆధ్వర్యంలో ఆటోరిక్షాలు, మోటార్ క్యాబ్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా రవాణాశాఖ అధికారి (District Transport Officer) ఆదేశానుసారం ఈ తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు. విద్యార్థులను విద్యాసంస్థల నుంచి వారి ఇళ్లకు తీసుకెళ్తున్న వాహనాల డ్రైవర్ల లైసెన్స్లు, వాహన పత్రాలు పరిశీలించామన్నారు.
RTA Yellareddy | రహదారి నియమాలు పాటించాలి
వాహనాల డ్రైవర్ల రహదారి నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడిపించాలని ఏఎంవీఐలు సూచించారు. విద్యార్థులను జాగ్రత్తగా తీసుకుని రావాలని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా మూడు వాహనాలకు జరిమానాలు వేశామని అధికారులు తెలిపారు.