More
    Homeజిల్లాలునిజామాబాద్​Prajapalana | ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్​

    Prajapalana | ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Prajapalana | జిల్లాలో ఈనెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో (Collectorate) నిర్వహించనున్న ఈ వేడుకలను పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ తన చాంబర్​లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

    ప్రజాపాలన (Prajapalana) దినోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని అన్నారు. ముఖ్య అతిథితో పాటు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షించాలని అన్నారు. వేదిక, సీటింగ్ ఏర్పాట్లు, తదితర వాటి గురించి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Gutta Jwala | 4 నెలల్లో 30లీట‌ర్ల త‌ల్లి పాల దానం.. అంద‌రి హృదయాలను గెలుచుకున్న గుత్తా జ్వాల..

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Gutta Jwala | పెళ్లి తర్వాత ప్రతి మహిళ తల్లి కావాలని కలలు కంటుంది....

    CP Sai Chaitanya | పోలీసు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రతిఒక్కరూ పోలీసులు సూచించిన...

    MLA Bhupathi Reddy | సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్​లో చేరికలు

    అక్షరటుడే, డిచ్‌పల్లి : MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) అమలు చేస్తున్న పథకాలకు...