ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Fourth City | ఫోర్త్​ సిటీ నుంచి అమరావతికి ఎక్స్​ప్రెస్​ హైవే

    Fourth City | ఫోర్త్​ సిటీ నుంచి అమరావతికి ఎక్స్​ప్రెస్​ హైవే

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Fourth City | రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్​ సిటీ పేరిట ఫోర్త్​ సిటీ అభివృద్ధికి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్​ నగరంలో హైదరాబాద్​ (Hyderabad), సికింద్రాబాద్ (Secunderabad)​, సైబరాబాద్​ (Cyberabad) మూడు సిటీలు ఉన్నాయి.

    తాజాగా నాలుగో నగరంగా ఫ్యూచర్​ సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫోర్త్​ సిటీని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో గల 56 రెవెన్యూ గ్రామాలతో ఫ్యూచర్​ సిటీని డెవలప్​ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.

    Fourth City | గ్రీన్​ఫీల్డ్​ హైవే

    రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫోర్త్​ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతికి గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్​ హైవే (Greenfield Express Highway) నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ అధికారులు ఏపీ ప్రభుత్వానికి (AP Government) ప్రతిపాదన పెట్టారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలపై ఇటీవల కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించింది.

    సమావేశంలో ఫోర్త్ సిటీ నుంచి అమరావతి వరకు నూతన రహదారి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర హోం శాఖ (Union Home Ministry) ఆమోదం తెలిపినట్లు సమాచారం. డీపీఆర్ రూపొందించాలని రవాణా శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

    Fourth City | డ్రై పోర్టు నుంచి రైలు మార్గం

    రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం లేకపోవడంతో సరుకుల ఎగుమతి, దిగుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఖర్చు ఎక్కువ అవుతోంది. దీంతో తెలంగాణలో డ్రై పోర్టు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

    హైదరాబాద్​ శివారు ప్రాంతంలో డ్రై పోర్టు (Dry port) నిర్మించి అక్కడ అన్ని వసతులు కల్పించాలని యోచిస్తోంది. అక్కడి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు రైలు మార్గం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. దీంతో డ్రైపోర్టు నుంచి మచిలీపట్నం (Machilipatnam) వరకు సరుకుల రవాణాకు ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఫోర్త్​ సిటీ నుంచి అమరావతికి నిర్మించే గ్రీన్​ఫీల్డ్​ హైవేను కూడా డ్రైపోర్టుకు అనుసంధానం చేయాలని చూస్తున్నారు.

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...