4
అక్షరటుడే, బాన్సువాడ: Vemulawada Bus | బాన్సువాడ నుంచి వేములవాడకు ఎక్సెప్రెస్ బస్(Express bus) సర్వీస్‌ను శుక్రవారం ప్రారంభించినట్లు డిపో మేనేజర్ సరితా దేవి(Depot Manager Sarita Devi) తెలిపారు. బాన్సువాడ నుంచి ఉదయం 8.20 గంటలకు బయలుదేరి కామారెడ్డి మీదుగా 11.20కి వేములవాడ చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరిగి 11.40 గంటలకు వేములవాడ నుంచి బాన్సువాడకు సాయంత్రం 6.10 గంటలకు చేరుకుంటుందని వివరించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.