అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balochistan | భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ బలూచిస్తాన్ స్వాతంత్య్రం ప్రకటించుకున్న విషయం తెలిసిందే. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులే లక్ష్యంగా పలు దాడులు చేపడుతోంది. అయితే బలూచిస్థాన్ ప్రావిన్స్(Balochistan province)లోని ఓ మార్కెట్ వద్ద భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. దాదాపు 20 మంది గాయపడ్డారు. బలూచిస్థాన్‌లోని కిల్లా అబ్దుల్లా (Killa Abdullah) జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి అనేక దుకాణాలు ధ్వంసమయ్యాయి. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ దాడి ఎవరు చేశారని ఇంతవరకు తెలియరాలేదు. బలూచిస్తాన్‌లోని గులిస్తాన్‌లో గల పాకిస్తాన్ ఆర్మీ ఫ్రాంటియర్ కార్ప్స్ శిబిరమే లక్ష్యంగా ఈ పేలుడు చోటు చేసుకుంది.
