అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amit Shah | జమ్మూ కశ్మీర్‌లోని నౌగాం పోలీస్ స్టేషన్లో (Nowgam police station) శుక్రవారం రాత్రి పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. 31 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) శనివారం సాయంత్రం ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు (Jammu and Kashmir police) ఇటీవల వైద్యుల ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గత వారం హర్యానాలోని ఫరీదాబాద్ (Faridabad) నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నిల్వను రెవెన్యూ అధికారులతో కలిసి ఫోరెన్సిక్ బృందం శుక్రవారం రాత్రి పరిశీలించింది. ఆ సమయంలోనే పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలో 9 మంది మరణించగా, 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో రాష్ట్ర దర్యాప్తు సంస్థ (State Investigation Agency)(SIA) అధికారి, నాయిబ్ తహశీల్దార్ కూడా ఉన్నారు.
Amit Shah | పేలుడు పదార్థాల తరలింపు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం శ్రీనగర్‌కు చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శ్రీనగర్‌లోని నౌగామ్‌లోని పోలీస్ స్టేషన్ లోపల జరిగిన పేలుడు ఘటన గురించి ఆయన ఆరా తీయనున్నారు. కాగా పేలుడు పదార్థాన్ని శ్రీనగర్‌కు (Srinagar) తరలించారు. నౌగామ్ పోలీస్ స్టేషన్ లోపల బహిరంగ ప్రదేశంలో భద్రంగా ఉంచారు. నిర్దేశించిన విధానంలో భాగంగా, రికవరీ పదార్థం నమూనాలను ఫోరెన్సిక్ మరియు రసాయన పరీక్ష కోసం పంపించారు.
