అక్షరటుడే, వెబ్డెస్క్ : Sivakasi | తమిళనాడు (Tamil Nadu)లోని శివకాశిలోని ఓ టపాసుల పరిశ్రమలో శనివారం పేలుడు చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.
దేశంలో టపాసుల తయారీకి శివకాశి ప్రసిద్ధి చెందిందనే విషయం తెలిసిందే. ఇక్కడ అనేక టపాసుల తయారీ పరిశ్రమలు ఉంటారు. శనివారం ఓ ఫ్యాక్టరీలో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో పది మంది కార్మికులు పరిశ్రమలో ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రాకర్ ఫ్యాక్టరీలోని మొత్తం గదిని చదును చేశారు. ఫ్యాక్టరీలో టపాసులు పేలుతూనే ఉండటంతో ఎవరూ లోపలికి ప్రవేశించలేరు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
కాగా శివకాశిలో గతంలో సైతం అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలోని బాణసంచా తయారీ యూనిట్‌లో అగ్ని ప్రమాదం జరగ్గా ఏడుగురు మృతి చెందారు. బాణసంచా నిల్వలపై ఒక నిప్పురవ్వ మండడంతో ప్రమాదం జరిగింది. టపాసుల పరిశ్రమల్లో పేలుళ్లలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పరిశ్రమల్లో నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
శివకాశీలోని బాణసంచా కేంద్రంలో పేలుడు
బాణసంచా తయారీ కేంద్రంలో ఎగిసిపడుతున్న మంటలు
మంటల్లో చిక్కుకున్న 10 మంది కార్మికులు
మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
కొనసాగుతున్న సహాయక చర్యలు #Sivakasi #FireAccident #Crackers #TamilNadu #TV9Telugu pic.twitter.com/SHtSwtPX4x— TV9 Telugu (@TV9Telugu) October 11, 2025