అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | మొబైల్ ఫోన్(Mobile Phone) పేలి ఓ యువకుడు సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట రింగ్ బస్తీ(Jagadgirigutta Ring Basti)లో చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉండే సాయి ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు అంటుకొని సాయి సజీవ దహనం అయ్యాడు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
కాగా.. దేశంలో ఇటీవల ఫోన్ పేలుతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వేగంగా ఫోన్ ఛార్జ్ కావడానికి అల్ట్రాఫాస్ట్ ఛార్జర్లు(Ultrafast chargers) అందుబాటులోకి వచ్చాయి. అయితే వేగంగా ఛార్జింగ్ అవుతున్న క్రమంలో ఫోన్లు వేడుక్కుతున్నాయి. ఈ క్రమంలో ఫోన్లు పేలిపోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఫోన్ ఛార్జింగ్(Phone charging) పెట్టిన సమయంలో ఆపరేట్ చేయొద్దని సూచిస్తున్నారు. అలాగే ఫోన్ బ్యాక్ కవర్లో డబ్బులు, ఇతర పేపర్లు పెట్టొద్దని చెబుతున్నారు. వాటిమూలంగా కూడా ఫోన్లు హీట్ అవుతాయని పేర్కొంటున్నారు.