అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anaganaga Oka Raju Trailer | టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్, సహజ నటనతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటున్న హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ – మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.
Anaganaga Oka Raju Trailer | ట్రైలర్ అదిరింది..
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, ప్రమోషనల్ వీడియోలు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి స్పందన పొందాయి. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ ప్రారంభం నుంచే గోదావరి జిల్లాల నేపథ్యాన్ని, అక్కడి సంస్కృతి, మాట తీరును చూపిస్తూ పండగ వాతావరణాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ట్రైలర్‌ను గమనిస్తే, గోదావరి జిల్లా (Godavari District) ల్లోని ఒక గ్రామంలో నివసించే జమిందార్ కుటుంబానికి చెందిన యువకుడి కథగా సినిమా సాగబోతున్నట్టు అర్థమవుతోంది. పెళ్లి కోసం చూస్తున్న ఆ యువకుడి జీవితంలో ఎదురయ్యే సరదా సంఘటనలు, కుటుంబ సభ్యుల మధ్య నడిచే హాస్యభరిత సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం కావనున్నాయని ట్రైలర్ సూచిస్తోంది. నవీన్ పొలిశెట్టి తన మార్క్ కామెడీతో మరోసారి నవ్వులు పూయిస్తున్నాడు. అతని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ట్రైలర్‌కు నాగార్జున (Nagarjuna) ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన వాయిస్‌లో వచ్చే డైలాగులు కథకు ఓ వెయిట్‌ను తీసుకువచ్చాయి. అలాగే మీనాక్షి చౌదరి పాత్ర కూడా ట్రైలర్‌లో బాగానే హైలైట్ అయ్యింది. నవీన్ – మీనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్రెష్‌గా ఉండటంతో పాటు మంచి కెమిస్ట్రీ కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు అదనపు శక్తిని ఇచ్చింది. ముఖ్యంగా పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే మ్యూజిక్, గోదావరి జిల్లాల సెటప్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ కూడా కలర్‌ఫుల్‌గా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా డిజైన్ చేశారు.