అక్షరటుడే, బాన్సువాడ: Coins and stamps Exhibition | బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ స్కూల్లో (Ripples School) శనివారం నాణేలు, నోట్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 300 ఏళ్ల క్రితం వరకు నాణేలను ప్రదర్శించారు. బాన్సువాడ (banswada) పట్టణానికి చెందిన సేకరణకర్త రుద్రంగి గంగాధర్ దేశ, విదేశీ కరెన్సీ, నాణాలు, స్టాంపుల (currency, and stamps)ను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఏయే దేశాలకు చెందిన ఎప్పటి నాణేలు, స్టాంపులు తదితర విషయాలు వివరించారు.
Coins and stamps Exhibition | 189 దేశాల కరెన్సీ..
189 దేశాల కరెన్సీతో పాటు 10, 20, 50, 60, 100, 150, 200, 500,1000 రూపాయల నాణేలను ప్రదర్శించారు. అదేవిధంగా పురాతన కాలం నాటి రేడియో లైసెన్స్ (Radio license).. అన్ని దేశాలకు సంబంధించిన స్టాంపులను.. విదేశాల్లో రిలీజ్ అయిన మన హిందూ దేవుళ్ల స్టాంప్‌లను (Hindu Gods stamp) విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఫాల్గుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.