Homeజిల్లాలుకామారెడ్డిTiranga Yatra | ఎల్లారెడ్డిలో ఉత్సాహంగా తిరంగా యాత్ర

Tiranga Yatra | ఎల్లారెడ్డిలో ఉత్సాహంగా తిరంగా యాత్ర

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Tiranga Yatra | ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్​ చౌరస్తా నుంచి గాంధీ చౌక్​, బస్టాండ్​ మీదుగా ర్యాలీ తీశారు.

ఆపరేషన్​ సింధూర్ (Operation Sindoor)​ విజయవంతం అయినందుకు సంకేతంగా తిరంగాయాత్ర నిర్వహించినట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు త్రివర్ణ పతకాలు చేత పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. మానవహారం నిర్వహించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం రాజు, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ.. దేశ ప్రజలు సాయుధ దళాలకు (Indian Army) రుణపడి ఉంటారన్నారు. యాత్రలో బీజేపీ నాయకులు మర్రి బాలకిషన్, దేవేందర్, రాజేష్, నర్సింలు, రాములు, మురళి తదితరులు పాల్గొన్నారు.