అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet | లింగంపేట మండలం షెట్పల్లి సంగారెడ్డి (Shetpalli Sangareddy) గ్రామంలో శనివారం దుర్గమ్మకు (Goddess Durga), పోచమ్మ దేవతలకు ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో ఎడ్లబండ్లను రంగురంగు చీరలతో, మామిడి తోరణాలతో అలంకరించి ఆలయాల చుట్టూ ప్రదర్శన చేపట్టారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల విన్యాసాలు ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. ప్రతి ఏటా దుర్గమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
