ePaper
More
    HomeతెలంగాణKaleshwaram Commission | ‘కాళేశ్వరం’ విచారణపై ఉత్కంఠ.. రేపు కమిషన్​ ముందుకు ఈటల

    Kaleshwaram Commission | ‘కాళేశ్వరం’ విచారణపై ఉత్కంఠ.. రేపు కమిషన్​ ముందుకు ఈటల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్​ఎస్(BRS)​ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ (Congress)​ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్​లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు జస్టిస్​ పీసీ ఘోష్(PC Gosh)​ కమిషన్​ ఏర్పాటు చేసింది.

    Kaleshwaram Commission | ఈటల ఏం చెప్పనున్నారు..

    బీఆర్​ఎస్​ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్ట్​కు అంకురార్పణ జరిగింది. ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్(Etala Rajender)​, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఉన్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్​ మాజీ సీఎం కేసీఆర్​తో పాటు, ఈటల, హరీశ్​ రావుకు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా జూన్ ​6న ఈటల కమిషన్​ ముందు హాజరు కానున్నారు. ఈటల ప్రస్తుతం బీజేపీ(BJP)లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్​ విషయంలో కమిషన్​ ముందు ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.

    READ ALSO  RTC MD Sajjanar | పిచ్చి పీక్స్‌కి వెళ్ల‌డం అంటే ఇదేనేమో.. ప‌ట్టాల‌పై ప‌డుకొని సెల్ఫీ వీడియో

    Kaleshwaram Commission | కేసీఆర్​ ఆదేశాల మేరకే నిర్ణయాలు

    కాళేశ్వరం కమిషన్​ ఇప్పటికే 200 మంది అధికారులను, 25 మంది ఐఏఎస్ అధికారులను విచారించింది. బ్యారేజీల నిర్మాణ సంస్థలు, ఇంజినీర్లు, కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను పరిశీలించింది. కేసీఆర్​ ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు కమిషన్​ ఎదుట చెప్పారు. దీంతో ఆయన వివరణ తీసుకోవడంతో పాటు ఆ సమయంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈటల, హరీశ్​రావును విచారించేందుకు కమిషన్​ నోటీసులు ఇచ్చింది.

    Kaleshwaram Commission | తుది నివేదిక అప్పుడే..

    కాళేశ్వరం కమిషన్​ గడువు ముగిసింది. అయితే విచారణ పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ క్రమంలో ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్​కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన జూన్​ 11న హాజరవుతానని కమిషన్​కు తెలుపగా.. కమిషన్​ అంగీకరించింది. శుక్రవారం ఈటల విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 9న హరీశ్​రావును కమిషన్​ ప్రశ్నించనుంది. వీరి వాంగ్మూలం సేకరించి జూన్​ 30 నాటికి తుది నివేదిక సమర్పించాలని కమిషన్​ యోచిస్తోంది.

    READ ALSO  Police Department | ఇన్​స్పెక్టర్​పై పోక్సో కేసు ఆరోపణలు.. ఏకంగా కీలక సర్కిల్ బాధ్యతలు

    Latest articles

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: కళియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. దీంతో తిరుమల Tirumala...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న కీలక అంశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief...

    More like this