అక్షరటుడే, ఇందూరు: Excitement In Nizamabad Corporation Results | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య పోరు నువ్వా..నేనా అన్నట్లుగా సాగింది. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాష్ట్రంలోనే నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి.
Excitement In Nizamabad Corporation Results | ఎటూ తేలని ఫలితం..
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. బీజేపీ (Nizamabad BJP) 28 డివిజన్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుపొందగా.. ఎంఐఎం 14 డివిజన్లలో తన ఆధిపత్యాన్ని నిలుపుకొంది. బీఆర్ఎస్ ఒక స్థానంలో గెలుపొందింది.
కీలకంగా మారిన బీఆర్ఎస్ కార్పొరేటర్..
ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అర్బన్ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందోననే చర్చ జరుగుతోంది. ప్రధానంగా 37వ డివిజన్ నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి కీలకంగా మారారు. ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ నేతలు సదరు బీఆర్ఎస్ తరఫున గెలిచిన అభ్యర్థిని తమ పార్టీ వైపు రావాలంటూ అభ్యర్థిస్తున్నారు. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థితో చర్చించేందకు కౌంటింగ్ కేంద్రం వద్దకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాంభూపాల్ రాగా.. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి వద్దకు బీజేపీ నాయకులు చేరుకున్నట్లు సమాచారం.