Homeక్రైంShadnagar Police | గంజాయి కొట్టేసి.. కటకటాల పాలైన ఎక్సైజ్​ కానిస్టేబుల్​

Shadnagar Police | గంజాయి కొట్టేసి.. కటకటాల పాలైన ఎక్సైజ్​ కానిస్టేబుల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shadnagar Police | గంజాయి అమ్మేవారిపై కేసులు పెట్టాల్సిన ఓ ఎక్సైజ్​ కానిస్టేబులే గంజాయి కొట్టేశాడు. అంతటితో ఆగకుండా గంజాయి విక్రయించాలని తన బంధువును పురమయించాడు. తీరా కటకటాల పాలయ్యాడు.

ఈ ఘటన రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గులాం సుల్తాన్‌ అహ్మద్‌(52) తాండూరు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ (Tandur Excise Police Station)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గతంలో పట్టుబడిన గంజాయి దహనం చేయడానికి తీసుకెళ్తుండగా.. కానిస్టేబుల్​ అహ్మద్​ చేతివాటం ప్రదర్శించాడు.

అందులో నుంచి మెల్లిగా కిలోన్నర గంజాయి కొట్టేశాడు. ఆ గంజాయి ప్యాకెట్​ను తన బంధువు షాద్‌నగర్‌ (Shadnagar)కు చెందిన మహ్మద్‌ అంజాద్‌(32)కు ఇచ్చి విక్రయించాలని సూచించాడు. షాద్‌నగర్‌లోని ఫరూఖ్‌నగర్‌ ఈద్గా వద్ద అంజాద్​ గంజాయి విక్రయించడానికి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా.. తనకు ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సుల్తాన్‌ గంజాయి ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.