అక్షరటుడే, ఇందూరు: Excise Constable Soumya : గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ICUలో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా సౌమ్య ప్రాణాలు నిలబడలేదు. అవయవాలు దెబ్బతినడంతో ఆరోగ్యం క్షీణించి శనివారం (జనవరి 31) రాత్రి 9:41 నిముషాలకు మృతి చెందినట్లు NIMS ప్రకటించింది.
Excise Constable Soumya | అసలేం జరిగిందంటే..
నిజామాబాద్ (Nizamabad) నగరంలోకి శుక్రవారం రాత్రి ఎండు గంజాయిని తీసుకొస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (Excise Circle Inspector) తన సిబ్బందితో మాధవనగర్ ఎంట్రన్స్ వద్ద రూట్ వాచ్ నిర్వహించారు. ఈ క్రమంలో నగరంలోకి అనుమానాస్పదంగా వచ్చిన కారురు ఆపేందుకు ప్రయత్నించగా.. డ్రైవర్ కారును ఆపకుండా ఎక్సైజ్ కానిస్టేబుల్ జీ సౌమ్యను ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ (Excise Constable) రోడ్డుపై పడిపోయి ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
ఘటన జరిగిన వెంటనే ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పారిపోతున్న కారును పట్టుకొని అందులో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి దగ్గర నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సౌమ్యను కారుతో ఢీకొట్టిన సోహెల్, రాహిల్, మతిన్, మరోవ్యక్తిపై ఎక్సైజ్ సీఐ స్వప్న (Excise CI Swapna) ఫిర్యాదు రూరల్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.