అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Soumya Government Job | విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.
Soumya Government Job | గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో..
నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ (Excise Constable) గాజుల సౌమ్య గతనెల 23న విధి నిర్వహణలో గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో నగరంలో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గంజాయితో వస్తున్న ముఠా కారుతో కానిస్టేబుల్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడి తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సౌమ్య జనవరి 31న పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ (NIMS Hospital)లో మృతి చెందింది.
Soumya Government Job | స్పందించిన ప్రభుత్వం..
ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) స్పందించారు. విధి నిర్వహణలో గాజుల సౌమ్య చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు. అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. స్వయంగా అంత్యక్రియలకు ఆయన హాజరై సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతులమీదుగా సౌమ్య కుటుంబ సభ్యులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు.
Soumya Government Job | సౌమ్య తమ్ముడికి ఉద్యోగం..
అదేవిధంగా సౌమ్య తమ్ముడు గాజుల శ్రవణ్‌కు ఎక్సైజ్ శాఖ (Excise Department)లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) చేతుల మీదుగా సోమవారం అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంఘటన జరిగిన నెల రోజుల్లోపే సౌమ్య కుటుంబానికి రూ.కోటి, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని తెలిపారు. సౌమ్య మరణానికి కారణమైన దుండగులను కఠినంగా శిక్షిస్తామని సౌమ్య కుటుంబానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి (Excise Deputy Commissioner Somi Reddy), నోడల్ డీపీ ఈవో మల్లారెడ్డి, సీఐ స్వప్న, ఎస్సై మల్లేష్, కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ యూనియన్ అధ్యక్షుడు రవి, కార్యదర్శి చంద్ర మోహన్ పాల్గొన్నారు.
