అక్షరటుడే, డిచ్పల్లి/కామారెడ్డి: Telangana University | భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో జరగాల్సిన పీజీ పరీక్షలను (PG Exams) వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్ పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాల కారణంగా ఈనెల 29, 30వ తేదీల్లో జరిగే పీజీ/బీఎడ్/ఎంఎడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులు గమనించాలని సూచించారు.
Telangana University | ఉమ్మడి జిల్లాలో వర్షబీభత్సం
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని (Heavy Rains) స్తంభింపజేశాయి. చాలాచోట్ల రహదారులు తెగిపోయాయి. దీంతో రెండురోజుల కామారెడ్డిలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నిజామాబాద్లో ఒకరోజు సెలవు ఇచ్చారు. అలాగే అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమై సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.