అక్షరటుడే, వెబ్డెస్క్: Ex Officio Voting Rules | మేయర్, ఛైర్పర్సన్ ఎన్నిక కోసం ఎక్స్ అఫీషియో సభ్యులపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక మున్సిపాలిటీ (Local Municipality)లో ఓటరుగా నమోదైన వారు మాత్రమే ఎక్స్ అఫీషియో ఓటు వేయడానికి అర్హులని స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రక్రియ పూర్తయింది. కౌంటింగ్ లెక్కలు తేలాయి. అధికార కాంగ్రెస్ మెజారిటీ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోగా.. పలుచోట్ల హంగ్ ఏర్పడింది. నాలుగు కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లో హంగ్ రావడంతో ఆయా పార్టీలు అధికారం దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆయా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. అలాగే ఎక్స్ అఫిషీయో ఓట్లు కూడా గెలుపును నిర్ణయించగలవు. ఈ క్రమంలో ఎక్స్ అఫిషీయో ఓటర్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది.
Ex Officio Voting Rules | వీరు అర్హులు
మున్సిపల్ ప్రాంతంలో ఓటర్గా రిజిస్టర్ అయితేనే.. సదరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్గా ఓటు వేయొచ్చు. రాజ్యసభ MP, ఎమ్మెల్సీకి కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని పేర్కొంది. అర్హతలేని సభ్యులకు ఓటు హక్కు ఉండదని స్పష్టం చేసింది.రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు (Municipal Commissioners) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్సీలకే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేస్తే చెల్లదని, స్థానిక ఓటు లేని వారు అనర్హులని పేర్కొంది. దీంతో అధికారానికి దగ్గర ఉన్న చోట ఆయా పార్టీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషీయో మెంబర్గా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. హంగ్ ఏర్పడిన ప్రాంతాల్లో విజయం ఎవరిది అనే విషయం ఈ నెల 16న తేలనుంది.