ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ex Mla Jeevan reddy | జనహిత యాత్ర కాదు.. జనరహిత యాత్ర : మాజీ...

    Ex Mla Jeevan reddy | జనహిత యాత్ర కాదు.. జనరహిత యాత్ర : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan reddy | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) చేపట్టిన యాత్ర ‘జనహిత పాదయాత్ర’ (Janahitha Padayatra) కాదని.. ‘జనరహిత పాదయాత్ర’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్​లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనం లేక మీనాక్షి పర్యటన వెలవెలబోతోందన్నారు.

    మీనాక్షి పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో పీసీసీ చీఫ్​ సైతం అసహనం వ్యక్తం చేశారని జీవన్​రెడ్డి పేర్కొన్నారు. తాను పంపిన డబ్బులు అందరికీ పంచలేదా.. అని పార్టీ వర్గాలపై పీసీసీ చీఫ్​ రుసరుసలాడాడని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో సిద్దులగుట్ట శివయ్య సాక్షిగా నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు.

    Ex Mla Jeevan reddy | రేవంత్​రెడ్డి డమ్మీ సీఎం..

    రేవంత్​ను (CM Revanth Reddy) డమ్మీ సీఎంను చేసి ఢిల్లీ చుట్టూ తిప్పుకుంటున్నారని, మీనాక్షి నటరాజన్​ను షాడో సీఎంను చేసి తెలంగాణలో తిప్పుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే 50 సార్లు ఢిల్లీ వెళ్లి గాంధీ ఫ్యామిలీకి రేవంత్​రెడ్డి భజన చేస్తున్నారని జీవన్​రెడ్డి ఆరోపించారు. ఇక మీనాక్షి పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో ఆర్మూర్ రైతులపై పోలీసుల దాష్టీకాలు కొనసాగాయని ఆయన ఆరోపించారు.

    Ex Mla Jeevan reddy | అన్నదాతలను అరెస్ట్ చేసి పాదయాత్రలా..?

    జిల్లా వ్యాప్తంగా అన్నదాతలను.. బీఆర్​ఎస్ (BRS)​ కార్యకర్తలను అరెస్ట్​లు చేసి పాదయాత్ర నిర్వహించి ఏం సాధించాలని అనుకుంటున్నారో కాంగ్రెస్​ నాయకులు చెప్పాలని జీవన్​రెడ్డి డిమాండ్​ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్​ను (BC Declaration) కోమాలోకి పంపించారని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోనే 2 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న విషయం పాదయాత్ర సందర్భంగా మీ దృష్టికి రాలేదా అని ఆయన ప్రశ్నించారు. రూ. 4వేల చొప్పన ఆసరా పెన్షన్లు ఇస్తామన్న హామీ ఏమైందని.. కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా ఆయన ప్రశ్నించారు.

    Ex Mla Jeevan reddy | పీసీసీ చీఫ్​ అసభ్య మాటలు మానుకోవాలి..

    టీపీసీసీ అధ్యక్షుడు (PCC Chief) మహేష్ కుమార్ గౌడ్ అసభ్యకరమైన మాటలు మానుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. బీఆర్ఎస్ పదేళ్లపాలనపై పచ్చిఅబద్దాలు చెబుతూ..కేసీఆర్​, కేటీఆర్​పై విషం కక్కుతున్నాడని పీసీసీ చీఫ్​ను విమర్శించారు. బీఆర్​ఎస్​పై అబద్ధపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు.

    Latest articles

    Bheemgal | మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి

    అక్షరటుడే, భీమ్‌గల్‌: Bheemgal | మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐకేపీ ఏపీఎం ప్రమీల సూచించారు. మంగళవారం మండలంలోని పిప్రి...

    Cloudburst | ఉత్తరాఖండ్​ వరదల్లో 12 మంది మృతి.. 10 మంది జవాన్ల గల్లంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloudburst | ఉత్తరాఖండ్ (Uttarakhand)​ రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం క్లౌడ్​ బరస్ట్​ అయి కుండపోత...

    Nizamsagar | కబ్జా బారి నుంచి చెరువులను కాపాడాలి

    అక్షరటుడే, నిజాంసాగర్‌ : Nizamsagar | మండలంలోని మాగి గ్రామంలో చెరువు శిఖం భూములను కొందరు కబ్జా చేస్తున్నారని...

    Nizamsagar | నిజాంసాగర్ నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ఆయకట్టు కింద వానాకాలం పంటలు సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar...

    More like this

    Bheemgal | మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి

    అక్షరటుడే, భీమ్‌గల్‌: Bheemgal | మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐకేపీ ఏపీఎం ప్రమీల సూచించారు. మంగళవారం మండలంలోని పిప్రి...

    Cloudburst | ఉత్తరాఖండ్​ వరదల్లో 12 మంది మృతి.. 10 మంది జవాన్ల గల్లంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloudburst | ఉత్తరాఖండ్ (Uttarakhand)​ రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం క్లౌడ్​ బరస్ట్​ అయి కుండపోత...

    Nizamsagar | కబ్జా బారి నుంచి చెరువులను కాపాడాలి

    అక్షరటుడే, నిజాంసాగర్‌ : Nizamsagar | మండలంలోని మాగి గ్రామంలో చెరువు శిఖం భూములను కొందరు కబ్జా చేస్తున్నారని...