అక్షర టుడే, వెబ్‌డెస్క్:CP Sai Chaitanya | నగరంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ ప్రతాప్‌సింగ్(Head Constable Rathod Pratap Singh) గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి రూ. 16లక్షల ఎక్స్‌గ్రేషియా(Ex-gratia) మంజూరైంది. దీంతో సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) బాధిత కుటుంబీకులకు చెక్కు అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ(ఏఆర్) రామచంద్రరావు, ఏవో అనిసాబేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ వనజ, తదితరులు పాల్గొన్నారు.
