అక్షరటుడే, ఇందూరు : Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు (EWS Reservations) అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేవారు. ఆదివారం ఆయన నిజామాబాద్లో మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా.. అగ్రవర్ణాల్లో పేదల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే గొప్పగా పిలవబడే జాతులు అగ్రవర్ణ ప్రజలన్నారు. తమ పరిస్థితి రోజు రోజుకు అన్ని రకాలుగా దిగజారిపోతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలవి అనిల్ కుమార్, అశోక్, కోవూరి జగన్, ఆర్ యుగంధర్, జోషి క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
