అక్షరటుడే, ఇందూరు: BC sankshema Sangham | బాసర ట్రిపుల్ ఐటీ (Basara Triple) సీట్ల కేటాయింపులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar) ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటగిరీల వారీగా ట్రిపుల్ ఐటీ బాసరలో ప్రకటించిన కటాఫ్ మార్కులు (Cutoff marks) ఓసీలకే తక్కువగా ఉన్నాయన్నారు.
BC sankshema Sangham | అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో..
ఈడబ్ల్యూఎస్(EWS) ఓసీలకు కట్ ఆఫ్ మార్కులు కేవలం 564 కాగా.. బీసీ (ఏ) విద్యార్థులకు 571, బీసీ (బి) 578, బీసీ(సీ)566, బీసీ (డి)579, ఎస్సీ విద్యార్థులకు 566, ఎస్టీ విద్యార్థులకు 569 గా ఉన్నాయన్నారు. అగ్రవర్ణాల విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ పేరుతో కేవలం 564 మార్కులు ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ దక్కకపోవడం శోచనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు(SC ST BC students) అర్హులైన కూడా ఈడబ్ల్యూఎస్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం మళ్లీ సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
BC sankshema Sangham | అంతా ఏకతాటిపైకి రావాలి
ఈ చర్యపై ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు(SC ST BC Minorities) ఏకతాటిపై వచ్చి ఎదిరించి పోరాడాలన్నారు. బహుజన, మైనారిటీ, విద్యార్థి, యువజన, సంక్షేమ, ఉద్యోగ సంఘాలు రంగంలోకి దిగి భవిష్యత్తు తరాలకు అన్యాయం జరగకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే తాము నిజమైన అగ్రవర్ణ పేదలకు వ్యతిరేకం కాదన్నారు. నిజంగా నిరుపేద అగ్రవర్ణాలు ఎంత ఉన్నారో సర్వే చేసి.. వారికి 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు. సమావేశంలో నాయకులు బుస్సా ఆంజనేయులు, గంగా కిషన్, దేవేందర్, శంకర్, విజయ్, బాలన్న, సదానంద తదితరులు పాల్గొన్నారు.