అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి క్రాస్ ఓటింగ్‌పైనే నెలకొంది. మంగళవారం నిర్వహించనున్న ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించడం లాంఛనమే కానుంది.
అయితే గత కొన్ని ఎన్నికల్లో సాధించిన విజయం తరహాలో ఆధిక్యం అంతగా ఎక్కువగా ఉండకపోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. ఎన్డీయే అభ్యర్థికి లభించే మెజార్టీపైనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్రాస్ ఓటింగ్ జరిగితే ఇబ్బందులు తప్పవని ఆందోళనలో ఉన్న బీజేపీ(BJP).. ప్రతి ఎంపీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓటు వేసే అంశంపై అవగాహన కల్పిస్తోంది.
Vice President Election | రహస్య పద్ధతిలో ఓటింగ్..
పార్లమెంటు సభ్యులందరూ కలిసి రహస్య బ్యాలెట్ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అంటే ఎంపీలు తమకు నచ్చిన విధంగా ఓటు వేయవచ్చు, అయితే, ఎంపీలు తమ పార్టీ ఆదేశాల మేరకే ఓటు వేస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు క్రాస్ ఓటింగ్ జరుగడం సర్వసాధారణం, ఈ నేపథ్యంలో బీజేపీ అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న భావనతో ఉప రాస్ట్రపతి ఎన్నిక(Vice President Election)ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2022లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సులువుగా విజయం సాధించింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చాయి. అలాగే, మిగతా పార్టీలు కూడా ఓటు వేయడంతో జగదీప్ ధంఖర్ మూడు దశాబ్దాలలో అతిపెద్ద విజయాన్ని సాధించారు. ఆయన 75 శాతం ఓట్లు దక్కించుకున్నారు.
Vice President Election | ఈసారి భిన్నంగా..
ప్రస్తుతం 239 మంది రాజ్యసభ ఎంపీలు, 542 మంది లోక్‌సభ సబ్యులు ఉన్నారు, వీరందరూ ఓటు వేయడానికి అర్హులు. మొత్తం ఓటర్ల సంఖ్య 781 కాగా, 391 ఓట్లు లభించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. ఎన్డీయే 425 మంది సభ్యుల బలం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నిలబెట్టిన మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) విజయం సాధించడం ఖాయంగానే కనిపిస్తోంది. 2022లో కూటమి బయటి పార్టీలు కూడా మద్దతు ఇవ్వడంతో బీజేపీ గెలుపొందింది. ఈసారి కూడా అదే జరుగుతుందని భావిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇచ్చింది.
ఆ పార్టీకి రాజ్యసభలో ఏడుగురు, లోక్‌సభలో నలుగురు కలిపి మొత్తం 11 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు, బీఆర్ఎస్‌కు నలుగురు, బీజేడీకి ఏడుగురు సభ్యుల బలం ఉన్నప్పటికీ, ఎవరికీ మద్దతు ఇచ్చే అంశంపై ఇంకా తేల్చుకోలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కె. కవిత రాజీనామా చేయడం, బీజేపీ, కాంగ్రెస్ (Congress)రెండింటిపై పోరాట వైఖరి వంటి అంతర్గత గందరగోళం దృష్ట్యా బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. మరోవైపు, బీజేడీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇస్తుందని చెబుతున్నప్పటికీ, అధికారిక ప్రకటన రాలేదు. బీఆర్ఎస్, బీజేడీ మద్దతు ఇవ్వకపోయినా ఎన్డీయే 436 ఓట్లు ఉంటాయి. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ
స్వాతి మలివాల్ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశముంది.
Vice President Election | ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్..
మరోవైపు, విపక్ష ఇండి కూటమి కూడా తమ విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి (రిటైర్డ్) బి సుదర్శన్ రెడ్డి(Justice Sudarshan Reddy)ని అభ్యర్థిగా నిలబెట్టిన ఇండి కూటమికి రెండు సభల్లో కలిపి 324 సభ్యుల బలం ఉంది. కూటమి సభ్యులే కాకుండా ఆప్ ఎంపీ స్వాతి మలివాల్, స్వతంత్రులు, సింగిల్-ఎంపీ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేడీ వంటి ఓట్లు తమకే పడతాయని భావిస్తున్నారు. 100 శాతం ప్రతిపక్ష ఎంపీలు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేసినా ఆయన గెలువాంటే అదనంగా 70 ఓట్లు కావాలి.
ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామని ఆశించడం లేదని ఇండియా బ్లాక్ ఇప్పటికే అంగీకరించింది. అయితే, క్రాస్-ఓట్లు ఏవిధంగా ఉంటుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.గత ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే ప్రతిపక్షాల బలాన్ని నొక్కి చెప్పడానికి, రానున్న బీహార్, బెంగాల్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తమ బలాన్ని చూపించుకోవడానికి ఉప రాష్ట్రపతి ఎన్నికలను వినియోగించుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరియు రెండేళ్లలో ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.