HomeతెలంగాణBJP | అందరి జాతకాలు బయటపెడతా.. రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

BJP | అందరి జాతకాలు బయటపెడతా.. రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP | బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (mla rajasingh)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తారనే వార్తలపై ఆయన స్పందించారు. బీజేపీ (bjp)లో కొంతకాలంగా నిరసన గళం వినిపిస్తున్న గోషామహల్(Goshamahal)​ ఎమ్మెల్యే రాజాసింగ్​పై ఆ పార్టీ పెద్దలు చర్యలకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.
క్రమ శిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ తనకు నోటీసులు ఇవ్వొద్దని పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలన్నారు. అటు ఇటు కానివాళ్లతో పార్టీని బలోపేతం చేయలేం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారితో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేం అని పేర్కొన్నారు. ఒకవేళ తనను పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తే.. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందో వివరాలు బయట పెడతానన్నారు. అందరి జాతకాలు బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన వ్యాఖ్యలపై పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.