అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ACP Raja Venkat Reddy | పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఐదో టౌన్ పోలీస్ స్టేషన్‌ను (Police station) తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డు, రైటర్ రూంను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.
పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో ఉన్న వాహనాల అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని ఎస్సై గంగాధర్‌కు (SI gangadhar) సూచించారు. పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా కాలనీలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు.
ACP Raja Venkat Reddy | ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఏసీపీ సూచించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
ACP Raja Venkat Reddy | నిఘా పెంచాలి
స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘాల పెంచాలని ఏసీపీ సూచించారు. ఇసుక, జూదం, పీడీఎస్ బియ్యం (PDS Rice) అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలన్నారు. ఆన్లైన్ గేమ్స్ (Online games), బెట్టింగ్ (Betting) తదితర వాటిపై నిఘా పెంచాలని తెలిపారు.
పోలీస్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పోలీస్ అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నీతి నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పారు.