Homeజిల్లాలుకామారెడ్డిMla Pocharam | ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలి: ఎమ్మెల్యే పోచారం

Mla Pocharam | ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలి: ఎమ్మెల్యే పోచారం

ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడుచుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అడ్కస్ పల్లి గ్రామంలోని లింగమయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: Mla Pocharam | ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడుచుకోవాలని, అప్పుడే భగవంతుడు కరుణిస్తాడని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు(Government Agricultural Advisor), బాన్సువాడ నియోజకవర్గ (Banswada Constituency) ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని అడ్కస్ పల్లి గ్రామంలో సోమవారం మమ్మలనేని రాజశేఖర్ లింగమయ్య ఆలయాన్ని పునర్నిర్మించారు.

విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వేదపండితులచే ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఎక్కడైతే నిత్యం భగవంతుడికి సేవలు పూజలు జరుగుతాయో, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. భగవంతుని పైన ప్రతి ఒక్కరు భక్తి పెంచుకుని భక్తి మార్గంలో అడుగులు వేయాలన్నారు. మనం ధర్మం వైపునకు నిలబడితే ఆ పరమాత్మ మనవైపు నిలబడతారన్నారు.

ఆలయ నిర్మాణ దాత, ఆలయ కమిటీ ఛైర్మన్ మమ్మలనేని రాజశేఖర్ ముందుకొచ్చి లింగమయ్య ఆలయాన్ని పునర్నిర్మాణానికి కృషి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News