Homeజిల్లాలుకామారెడ్డిMLA Pocharam | ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలి : ఎమ్మెల్యే పోచారం

MLA Pocharam | ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలి : ఎమ్మెల్యే పోచారం

ప్రతిఒక్కరూ పోషకాహారం తీసుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో పోషణమాసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ : MLA Pocharam | ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పౌష్టికాహారం గురించి ప్రతి ఇంట్లో అవగాహన కల్పించడమే పోషణమాసం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. మహిళలు, గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. అంగన్​వాడీ సిబ్బంది (Anganwadi Staff) పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండిస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Kasula Balaraj), సీడీపీవో సౌభాగ్య, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్ మండలాల అంగన్​వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Must Read
Related News