Homeజిల్లాలునిజామాబాద్​Mla Dhanpal | ప్రతిఒక్కరూ అమ్మ పేరుపై మొక్క నాటండి..

Mla Dhanpal | ప్రతిఒక్కరూ అమ్మ పేరుపై మొక్క నాటండి..

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | బలిదాన్ దివస్ (Balidan Diwas) కార్యక్రమంలో భాగంగా పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) పిలుపునిచ్చారు. బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామా ప్రసాద్​ ముఖర్జీ (Shyama Prasad Mukherjee) బలిదాన్ దివస్ సందర్భంగా దుబ్బ చౌరస్తాలో మంగళవారం మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ఐక్యత, భారతీయ సాంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో బీజేఎస్​ను(BJS) శ్యామాప్రసాద్​ స్థాపించారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా 370 ఆర్టికల్​ను (Article 370) రద్దుచేసి కశ్మీర్​ను సుందరీకరణ చేశారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, దుబ్బ మండల అధ్యక్షుడు రాజు, కొండ ఆశన్న, మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.