అక్షరటుడే, ఇందూరు: Blood donation | ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఇంటెలిజెన్స్ ఏసీపీ మధుసూదన్ (Intelligence ACP Madhusudhan) సూచించారు. నగరంలోని రెడ్‌క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో (mega blood donation camp) ఆయన మాట్లాడారు.
Blood donation | 85వసారి రక్తదానం..
ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ ఏసీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ 85వ సారి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. తలసేమియా బాధితులకు తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం (blood donation camp) ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముందుగా తలసేమియా బాధితులకు ఏసీపీ పండ్లు పంపిణీ చేశారు. జిల్లా రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అందరి మన్ననలు చూరగొంటుందన్నారు.
Blood donation | రెడ్‌క్రాస్‌లో యువత భాగస్వామ్యం కావాలి..
యువత సన్మార్గంలో నడుస్తూ సమాజ హితానికి తోడ్పాటు అందిస్తున్న రెడ్‌క్రాస్‌లో (Red Cross) భాగం కావాలని ఏసీపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు, రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ట్రాన్స్‌కో ఏడీఈ తోటరాజశేఖర్, జూనియర్ రెడ్‌క్రాస్ సొసైటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ అబ్బాపూర్ రవీందర్, రెడ్‌క్రాస్ అర్బన్ ఛైర్మన్ నరాల సుధాకర్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రసాద్, బీసీ ఉద్యోగ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు చిట్టి నారాయణరెడ్డి, స్వామి కొయ్యడ శంకర్, వైద్యాధికారి రాజేష్, రెడ్‌క్రాస్ ప్రతినిధులు సంయోద్దీన్, సీనయ్య, డాక్టర్ చేతన్ రాజ్, శిశిర్ కుమార్, మృణాళిని, శ్రీలేఖ, రెడ్‌క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.