అక్షరటుడే, ఇందూరు : Satya Sai Baba | ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని కలిగి ఉండాలని సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో (Government General Hospital) భోజన సౌకర్యం కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ వరకు సత్య సాయిబాబా (Satya Sai Baba) జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహిళలకు చీరలు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కన్వీనర్ భాస్కర్ (Convener Bhaskar), పీఆర్వో ఇంజినీర్ గంగాధర్, సుదర్శన్, దేవేందర్, సతీష్, పుష్ప, మంజుల, అన్నపూర్ణ, సుమధుర తదితరులు పాల్గొన్నారు.
