12
అక్షరటుడే, ఇందూరు: Local body elections | ప్రతిఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి (ACP Raja Venkat Reddy) పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూర్‌లో ఎన్నికల కోడ్ (election code) అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రజలకు ఓటుహక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఓటు అనేది హక్కే కాదు.. బాధ్యత కూడా అని వివరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ టౌన్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా పోలీస్‌శాఖ నుంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగివంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.