అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | ఎన్నికల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా.. ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలంతా పోలీస్ శాఖకు, అధికార యంత్రాంగానికి సహకరించాలని ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ (MPDO Gangula Santosh Kumar) కోరారు.
భీమ్‌గల్ (Bheemgal) మండల పరిధిలోని ముచ్కూర్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలను (Gram Panchayat Elections) దృష్టిలో ఉంచుకుని, శాంతిభద్రతల నిర్వహణపై స్థానిక ఎస్సై సందీప్‌తో కలిసి శనివారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సందీప్ (SI Sandeep) మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు లేదా సమస్యలు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అనంతరం గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. కేంద్రంలో నామినేషన్ ప్రక్రియకు చేసిన ఏర్పాట్లు, భద్రత, అధికారుల సమన్వయం తదితర అంశాలను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.