అక్షరటుడే, ఇందూరు: Red cross Society Nizamabad | ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వస్తే తలసేమియా(Thalassemia) బాధితుల ప్రాణాలు కాపాడిన వారవుతారని రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు(Red Cross Society Chairman Bussa Anjaneyulu) పేర్కొన్నారు.
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా నగరంలోని సంస్థ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. సంస్థను స్థాపించిన హెన్రీ డూనంట్(Henry Dunant) చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే రెడ్‌క్రాస్ తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.
అనంతరం 84వసారి రక్తదానం చేసిన సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్‌ను సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. ఆయనతో పాటు సొసైటీ మెడికల్ ఆఫీసర్ అశ్విన్ కుమార్ రెడ్డి, పీఆర్వో రామకృష్ణ రక్తదానం చేశారు. ఇటీవల బాల్‌భవన్‌లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి కరిపే రవీందర్, నిజామాబాద్ డివిజన్ ఛైర్మన్ డాక్టర్ శ్రీశైలం, వైస్ ఛైర్మన్ మురళీకృష్ణ, జూనియర్ రెడ్‌క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్బాపూర్ రవీందర్, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంసీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.