అక్షరటుడే, నిజామాబాద్ సిటీ:CP Sai Chaitanya | కొత్త చట్టాలైన బీఎన్ఎస్(BNS), బీఎన్ఎస్ఎస్(BNSS), బీఎస్ఏ(BSA)లపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్లో బుధవారం జర్నలిస్టులకు వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 1860 నాటి బ్రిటీష్ కాలం చట్టాలను మార్చేసి బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్ఏ కొత్త చట్టాలను గత డిసెంబర్లో అమల్లోకి చెచ్చిందన్నారు. వివాదాస్పద వార్తలు రాసే సమయంలో లీగల్ ఒపీనియన్, కన్సల్ట్ ఆఫీసర్లను సంప్రదించాలని సూచించారు. సంఘటన నిజామా..? కాదా..? అనే విషయాన్ని గమనించాలన్నారు. పోక్సో(POCSO), మైనర్లకు (Minors) సంబంధించిన వార్తల విషయంలో బాధితుల వివరాలు వెల్లడించినట్లయితే కొత్త చట్టం ప్రకారం కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. విలేకరులు నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవడం తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు పాల్గొన్నారు.